డ్రైవింగ్ టెస్టుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

7 Feb, 2021 19:03 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా లెర్నింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆరునెలల్లో శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంచుకున్న సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల కనుక ఆ పరీక్షలో ఫెయిల్ అయితే మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అయితే తాజాగా కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.   

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చు. డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్‌ శిక్షణా కేంద్రాలకు ఈ మేరకు గుర్తింపు‌ ఇవ్వనుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వం చేత గుర్తింపబడిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసిన వారు రాష్ట్ర రవాణా అధికారుల నుండి లైసెన్స్ పొందవచ్చు. అలాగని శిక్షణ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వాటికి అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను గుర్తిస్తుంది. దీని కోసం ప్రభుత్వం కొన్ని నియమాలను సూచిస్తుంది. ఆ డ్రైవింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.(చదవండి: అసోంలో ప్రధాని మోదీ పర్యటన)

మరిన్ని వార్తలు