మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీశారు..

8 Aug, 2020 12:40 IST|Sakshi

ముంబై: జాలి లేకుండా కొందరు యువకులు ఒక కొండ చిలువను హింసించి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ  ఘటన బోరీవాలీలోని హనుమాన తెక్డీ ఏరియాలో జరిగింది. ముంబైలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా జోరుగా వానలు కురుస్తుండటంతో కొన్ని  వన్యప్రాణులు వాటి స్థావరాలను వదిలి పొడి ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక కొండ చిలువలువ నీరు లేని ఒక ప్రాంతానికి వెళ్లాలనుకుంది. అలా వెళుతున్న క్రమంలో ఆ మూగజీవి కొందరు ఆకతాయిల కంటపడింది.  వారు దాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు  కాళ్లతో తన్ని, చేతులతో కొట్టి అది వాళ్లకు లొంగాక దానితో సెల్ఫీలు తీసుకున్నారు. 

సెల్ఫీలు తీసుకున్న అనంతరం 8.5 అడుగుల కొండచిలువను ఓ సంచిలో పెట్టి దగ్గర్లోని అడవిలో వదిలేశారు. కొండచిలువను కొడుతున్నవీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి సంరక్షణ కర్త పవన్ శర్మ ఆ వీడియో ఆధారంగా అటవీ అధికారులకు ఫిర్యాదు  చేశారు. వెంటనే స్పందించిన అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. వారిని విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  చదవండి: నాగుల పంచమి: కొండచిలువ ‍కలకలం

మరిన్ని వార్తలు