ఒక్క క్షణం ఆలస్యమైతే.. పరిస్థితి? వైరల్‌ వీడియో 

27 Jan, 2021 17:44 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, రాజమండ్రి ‌: రైల్వే క్రాసింగ్‌ల వద్ద, రైలు పట్టాలవద్ద ఎన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్నా.. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా..జనాల నిర్లక్ష్యం మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది.   తొందరగా వెళ్లి పోవాలన్న ఆతృతలో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి  సీసీటీవీలో రికార్డైంది. టూవీలర్‌తో పాటు పట్టాలను దాటాలని ప్రయత్నించాడో యువకుడు. ఇంతలో అదుపుతప్పి పడబోయాడు. చివరి క్షణంలో చేతిలో బైక్‌ను అక్కడే వదిలేసి పక్కకు తప్పుకున్నాడు.  అంతే.. వేగంగా దూసుకొచ్చిన రైలు ధాటికి ఆ  బైక్‌ తునా తునకలైపోయింది. ఈ దృశ్యాల్ని చూసిన యువడికి గుండె అరచేతిలోకి వచ్చినంత పనైంది. క్షణాల్లో ప్రమాదం తప్పడంతో ఆ యువకుడు బతుకు జీవుడా... అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఆఖరి నిమిషంలో ప్రాణాలు దక్కిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  తూర్పుగోదావరి జిల్లా....రాజమండ్రి అన్నపూర్ణమ్మ పేట రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం  చోటు చేసుకుంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు