యువకుడి సెల్ఫ్‌ ‘రిప్‌’ పోస్టు..వెంటనే సూసైడ్‌

10 Dec, 2023 13:05 IST|Sakshi

కొచ్చి: ఓ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు బతికుండగానే తనకు తానే శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. అనంతరం కొద్దిసేపట్టికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన కేరళలోని ఆలువాలో చోటు చేసుకుంది. 

‘అజ్మల్‌ షరీఫ్‌(28) అనే యువకుడు తన ఫొటోకు రిప్‌(రెస్ట్‌ ఇన్‌ పీస్‌)అని క్యాప్షన్‌ పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తర్వాత కాసేపటికి ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అజ్మల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు 14 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. సరైన ఉద్యోగం రాలేదన్న కారణంగా అజ్మల్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశాం’ అని పోలీసులు తెలిపారు.  

ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి

>
మరిన్ని వార్తలు