అనర్హత పిటిషన్లపై వినతి పత్రం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు..

11 Aug, 2021 19:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్సీపీ ఎంపీల బృందం.. ఈ రోజు ( బుధవారం) కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజును కలిశారు. ఈ సందర్భంగా.. అనర్హత పిటిషన్లపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం అంజేశారు. అదే విధంగా, పదో షెడ్యుల్‌ను ఈ మేరకు సవరించాలని కోరారు. ఏపీ హైకోర్టును, జాతీయ న్యాయ వర్శిటీని  కర్నూలుకు తరలించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.

జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ కమిషన్ తరహాలో రాజ్యాంగబద్ధమైన  జాతీయ రైతుల కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చిన ఎంపీల బృందంలో విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు

మరిన్ని వార్తలు