ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలి: మోపిదేవి

23 Mar, 2022 14:57 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలను వైఎస్సార్‌సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరంలో 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతోపాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి.. మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ.1509 కోట్లతో మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దశలవారీగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు