ఫుడ్‌ డెలివరీ బాయ్‌ పాడుపని.. స్పందించిన జొమాటో.. ఏం చెప్పిందంటే!

21 Sep, 2022 19:54 IST|Sakshi

ఫుడ్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్‌.. యువతిని లైంగికంగా వేధించిన విషయంపై జొమాటో స్పందించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయతే డెలివరీ ఏజెంట్‌తో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.‘ మేము విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మేము ఏ వ్యక్తినైనా ఆన్‌బోర్డ్‌ చేసేటప్పుడు థర్డ్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లను నిర్వహిస్తాం. అలాగే మేము(జొమాటో కంపెనీ) జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉంటాం’ అని తన ప్రకటనలో పేర్కొంది.

అంతేగాక నిందితుడు సర్టిఫైడ్ డెలివరీ ఏజెంట్ కాని పేర్కొంది. అయితే జొమాటో స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదని, నిందితుడు అధికారిక డెలివరీ భాగస్వామి కాకపోతే బాలిక ఇంటికి ఫుడ్‌ ఎలా డెలివరీ చేశాడని ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు భద్రతా చర్యలను నిర్మించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

అసలేం జరిగిందంటే
పుణెలోని యోవలేవాడి ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 19 ఏళ్ల యువతి జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంది. ఫుడ్‌ డెలివరీకి వెళ్లిన రయీస్ షైల్జ్ అనే 42 ఏళ్ల యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈఘటన మహారాష్ట్రలో సెప్టెంబర్‌ చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఆహారం డెలివరీ చేసేందుకు 42 ఏళ్ల వ్యక్తి వెళ్లాడు. యువతి ఆ ఆర్డర్‌ తీసుకోగానే దాహం వేస్తుందని, మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. మంచి నీళ్లు తెచ్చి ఇచ్చిన క్రమంలో కుటుంబ సభ్యుల గురించి అడగటం మొదలు పెట్టాడు. తను ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వారు సొంత ఊళ్లకు వెళ్లారని వెల్లడించింది.

దీంతో ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు.. మరో గ్లాస్‌ మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. గ్లాస్‌ తీసుకుని వెనక్కి తిరిగిన క్రమంలో వెనక నుంచి గట్టిగా పట్టుకుని రెండు సార్లు బలవంతంగా చెంపపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం డెలివరీ బాయ్‌.. ఆమెకు వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపటం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు