అసోంలో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం

28 Apr, 2021 10:13 IST|Sakshi

ఆందోళనలో ప్రజలు

దెబ్బతిన్న పలు భవనాలు

గువాహటి: ఒకవైపు కరోనా మహమ్మారి తీవ్రత భయపెడుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ భూకంపం వణించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అందించిన సమాచారం ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో  బుధవారం ఉదయం భూకంపం సంభవించింది.  దీంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు. పలుభవనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులు బీటలు వారాయి.  అసోంలోని తేజ్‌పూర్‌కు పశ్చిమాన 43 కిలోమీటర్లు, లోతు 17 కిలోమీటర్లు భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు సమాచారం. అసోం, ఉత్తర బెంగాల్,  ఈశాన్య ప్రాంతాలలోని గౌహతిలో ప్రకంపనలు సంభవించాయి.దీంతో సోషల్‌ మీడియాలో  భూకంపం ఫోటోలు, వీడియోలు వెల్లువెత్తాయి. 

మరోవైపు దీనిపై అసోం ముఖ్యమంత్రి సరబానంద సోనోవాల్‌ కూడా ట్వీట్‌ చేశారు. భారీ భూకంపం సంభవించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా  కూడా భూకంపంపై  స్పందించారు.  సీఎం సోనోవాల్‌తో మాట్లాడానని  ప్రధాని ట్వీట్‌ చేశారు.  అన్ని విధాలా కేంద్రం  సహాయం చేస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఈ ఆపద సమయంలో అసోం ప్రజల భద్రతపై ప్రార్థిస్తున్నానన్నారు. 

మరిన్ని వార్తలు