ఘాటైన మిర్చీలు తిన్నాడు.. ఆపై!

3 Feb, 2021 16:41 IST|Sakshi

ఘాటైన మిర్చీలు తిని రికార్డులకెక్కాడు

టొరంటో: సాధారణంగా మిర్చీలను తగిన మోతాదులో వాడటం వల్ల వంటకాలకు అదనపు రుచి చేకూరుతుంది. అదే మోతాదుకు మించి వాడితే నోరు మంటపుట్టడంతో పాటు అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి, మిర్చీలను వంటకాల్లో భాగంగా కాకుండా నేరుగా ఆరగించడమే వృత్తిగా ఎంచుకున్నాడు. అతను ఆరగించే మిర్చీలు నామమాత్రపు ఘాటు ఉండే సాదాసీదా మిర్చీలనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రపంచ నలుమూలల్లో లభ్యమయ్యే ఘాటైన మిర్చీలను పోటీపడి మరీ ఆరగిస్తుంటాడు. అతను ప్రపంచవ్యాప్తంగా జరిగే చిల్లీ ఈటింగ్‌ పోటీల్లో పాల్గొంటుంటాడు.

కెనెడాకు చెందిన మైక్‌ జాక్‌ అనే వ్యక్తి ప్రపంచంలో అత్యంత ఘాటైన మిర్చీలుగా ప్రసిద్ధి చెందిన మూడు కరోలినా రీపర్‌ మిర్చీలను 10 సెకెన్లలోపు(9.72 సెకెన్ల) ఆరగించి 4 గిన్నీస్‌ ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నీస్‌ ప్రపంచ రికార్డుల ప్రతినిధులు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా, మైక్‌ గతంలో కూడా అనేక మిర్చీలు ఆరగించే పోటీల్లో పాల్గొని మూడు ప్రపంచ రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. అతను మున్ముందు ఎనిమిది కరోలినా రీపర్‌ మిర్చీలను తినడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని గిన్నీస్‌ రికార్డుల సంస్థ వెల్లడించింది. 

Read latest News News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు