కిడ్నాప్‌ కేసులో మూడేళ్ల జైలు

28 Sep, 2023 00:14 IST|Sakshi

కాసిపేట: మైనర్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులో గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన పెగడపల్లి వెంకటేష్‌కు మూడేళ్ల సాధారణ జైలుశిక్ష, రెండువేల రూపాయల జరిమానా బుధవారం మంచిర్యాల సీనియర్‌ సివిల్‌ జడ్జి, అసిస్టెంట్‌ సేషన్స్‌ జడ్జి ఆర్పిత మారం రెడ్డి విధించినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. 2016 అక్టోబర్‌ 30న నమోదైన కేసు ప్రకారం హైదరాబాద్‌ గాజుల రామారంకు చెందిన జెమాల్‌పూర్‌ అమర్‌నాథ్‌ కూతురు కల్వరి చర్చికి వచ్చింది. అక్కడి నుంచి కనిపించకుండ పోయినట్లు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పైవిధంగా తీర్పు వచ్చింది

మరిన్ని వార్తలు