మహోన్నత వ్యక్తి బసవేశ్వరుడు

28 Mar, 2023 00:46 IST|Sakshi

బాన్సువాడ: సమాజంలో కులమత భేదాలు లేకుండా మనుషులందరు ఒకటేనని 1200 ఏళ్ల కిత్రమే చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి బసవేశ్వరుడని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఒకటో వార్డులో వీరశైవలింగా యత్‌ కమ్యూనిటి భవన నిర్మాణానికి సోమవా రం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఏ ర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. భవ న నిర్మాణానికి రూ.20 లక్షలు మంజురు చేశాన ని, మరో రూ.25 లక్షలు మంజురు చేస్తానన్నా రు. బసవేశ్వర జయంతి అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలకు సుముచిత న్యాయం చేస్తున్నారని చెప్పారు. హైదరా బాద్‌లో 200 ఎకరాల్లో అన్ని కులాలకు భవనా లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో బసవేశ్వర భవనం కోసం రూ.కోటి నిధులు కూడా మంజురు చేసిందని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ అక్రిడేషన్‌లో బాన్సువాడ మాత శిశు ఆస్పత్రికి దేశంలోనే అవార్డు రావడంతో హర్షనీయమన్నారు. డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్‌, వీరశైవలింగాయత్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు దిగంబర్‌, శంకర్‌పటేల్‌, విజయ్‌పటేల్‌, మారుతి పటేల్‌, మహాదేవి, శ్రీలత, గంట చంద్రశేఖర్‌, మల్లికార్జున్‌, వీరప్ప, రమేష్‌, సుభాష్‌, ఆంజనేయులు, అశోక్‌పటేల్‌, నాయకులు అంజిరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు