అమ్మ తర్వాత గంగమ్మే..!

28 May, 2023 10:52 IST|Sakshi

ఏళ్ల తరబడిగా చేపలు ప ట్టే వృత్తిని కొనసాగిస్తూ గోదావరి తో ఎనలేని బంధాన్ని పె నవేసుకున్నారు మత్స్యకారులు. ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే గంగమ్మ ఒడిలోనే ఎక్కువ సేపు జీవనాన్ని గడుపుతుంటారు. డొంకేశ్వర్‌ మండల పరిధిలోని గ్రామాలన్నీ దాదాపుగా గోదావరికి ఆనుకుని ఉన్నాయి. అన్నారం, సిర్పూరం, న డ్కుడ, గాదెపల్లి, చిన్నయానం, నూత్‌పల్లి, నికాల్‌పూర్‌, డొంకేశ్వర్‌, దత్తాపూర్‌, మారపంల్లి, గంగసముందర్‌ గ్రామాల్లో గంగపుత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గ్రామాల న్నీ కలిపి మండలంలో మొ త్తం వెయ్యికి పైగా మ త్స్యకార కుటుంబాలున్నాయి. ఇందులో 60 శాతం మంది మత్స్యకారులు ఆయా గ్రామాలకు ఆను కుని ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి వెళ్ళి చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు.

సూర్యోదయానికి ముందే లేచి..
మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లోని గంగపుత్రుల జీవన విధానాన్ని చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. చేపల వేటకు వెళ్లడానికి ఒకరోజు ముందే గ్రూప్‌లుగా ఏర్పడుతారు. మరుసటి రోజు తెల్లవారక ముందే ఉదయం 4 గంటలకు లేచి ఇళ్ల నుంచి బైక్‌లపై కలిసికట్లుగా పయనమవుతారు. సూర్యుడు ఉదయించక ముందే గోదావరి తీరాలకు చేరుకుంటారు. ప్రస్తుతం వేసవి కావడంతో బ్యాక్‌ వాటర్‌ లోపలికి వెళ్లిపోయింది. దీంతో 11 కిలోమీటర్లు గోదావరి పచ్చిక బయళ్లలోనే ప్రయాణం చేసి ఉదయం 5 గంటల ప్రాంతానికల్లా గమ్యానికి చేరుతారు. వెంటనే దుస్తులు మార్చుకుని తెప్పల సాయంతో గంగలోకి దిగుతారు. తిరిగి మధ్యాహ్నం, లేదా సాయంత్రం ఇంటిబాట పడుతారు. ఇలా గోదారిలో చేపలు పట్టేవారి సంఖ్య దాదాపుగా 230కి పైనే ఉంటుంది.

గంగమ్మ వెనక్కి తగ్గితేనే చేపలు చిక్కేది..
సాధారణంగా గోదావరిలో నీళ్లు ఎక్కువగా ఉంటే మత్స్యకారులకు చేపల వేట ఇబ్బందిగానే ఉంటుంది. అలలు, గాలులు తీవ్రంగా ఉంటే గంగలోకి దిగ డానికి సాహసించరు. అయితే, వర్షా, చలికాలాల కంటే వేసవిలోనే చేపలు ఎక్కువగా దొరుకుతా యని గంగపుత్రులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో బ్యాక్‌వాటర్‌ ఎండిపోయి నీళ్లు త గ్గుతాయి. తద్వారా చేపల వేట సులభమవుతుంది. ఒక్కోసారి చేపలు దొరకని పక్షంలో సాహసం చేసి నీటిలో రెండు కిలో మీటర్ల లోపలికి వెళ్తారు. అప్పటికీ చేపలు పడకపోతే ఆ రోజు ఆ కుటుంబానికి ఉ పాధి లేనట్లే. వాహనాల్లో పెట్రోల్‌ పోసుకుని దూర ప్రాంతానికి వచ్చి చేపలు పడకపోతే గంగపుత్రుల కళ్లల్లో సంతోషం కనిపించదు. ఎందుకంటే చేపలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే కుటుంబాల పోషణ జరిగేది.

దళారులకే విక్రయించాల్సిన పరిస్థితి..
పడిన చేపలను విక్రయించడానికి మత్స్యకారులకు దళారులే దిక్కయ్యారు. ప్రభుత్వం కొను గోలు చేసి ఇతర ప్రాంతాల ఎగుమతి చేయడం లేదు. దీంతో వీరే కలకత్తా, నాగ్‌పూర్‌, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలను ఎగుమతి చేసి అమ్ముతున్నారు. తద్వారా తక్కువ రేటు వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రమాద బీమాను పెంచి, చేపలను నిల్వ ఉంచేందుకు కోల్డ్‌ స్టోరేజీలను, విక్రయించడానికి చేపల మార్కెట్లను నిర్మించివ్వాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు