-

అడ‌విలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాత‌కంగా..

27 Nov, 2023 09:04 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

సాక్షి, నిజామాబాద్‌: జుక్కల్‌మండలంలోని పుల్కల్‌కు చెందిన శాదుల్‌ (20) గ్రామ శివారు గుట్టలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మురళి ఆదివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన శాదుల్‌ కట్టెలు తీసుకురావడానికి సమీపంలోని గుట్టకు వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రా కపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. కుటుంబ సభ్యులు ఆదివారం గుట్టపై పరిశీలించగా మృతి చెంది ఉన్నాడు. పొలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి ముఖానికి గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు