-

బ్రాహ్మణులకు అండగా ఉంటాం

27 Nov, 2023 00:46 IST|Sakshi
మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద సందర్శకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా

నిజామాబాద్‌ నాగారం: బ్రాహ్మణులకు అండగా ఉంటామని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. నగరంలో ఆదివారం బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. నాగారంలో ఉన్న పూజారి కాలనీని అభివృద్ధి చేశామని తెలిపారు. నగరంలో బ్రాహ్మణ భవనం, వేద పాఠశాల నిర్మించాలని బ్రాహ్మణ సో దరులు అడిగారని, ఎన్నికలు పూర్తయ్యాక సమస్య ను పరిష్కరిస్తామన్నారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్‌ కొండపాక జ్యోతి, లక్ష్మీ నారాయణ భరద్వాజ్‌, కొండపాక రాజేష్‌ పాల్గొన్నారు.

ట్యాంక్‌బండ్‌ సందర్శన..

నగరంలోని ట్యాంక్‌బండ్‌ను ఆదివారం ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో ముచ్చటించారు. అలాగే ఎమ్మెల్యేతో పలువురు యువకులు, ప్రజలు సెల్ఫీలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు