ఆటా 17వ మహాసభలకు ఎమ్మెల్సీ కవిత

30 Jun, 2022 13:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ మహాసభల్లో  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. మహాసభల్లో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు.

జూలై 2న జరిగే ఆటా మహాసభల్లో కవిత చేతుల మీదుగా తెలంగాణ పెవిలియన్‌ ప్రారంభమవుతుంది. అదేరోజు సాయంత్రం జరిగే ప్రధాన సమావేశంలో కవిత అతిథిగా పాల్గొంటారు. ఇదే సమావేశం వేదికగా బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. వేడుకల  నిర్వహణకు 80 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆటా ప్రతినిధులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు