ప్రవాస ఆంధ్రులకు రూ.10 లక్షల ప్రమాద బీమా

29 Apr, 2021 08:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులకు తక్కువ ప్రీమియంతో ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీ) ప్రమాద, వైద్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. విదేశాల్లో పనిచేస్తున్న, చదువుకుంటున్న తెలుగువారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్పిందిగా ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటి బుధవారం తెలిపారు. ఉద్యోగస్తులు మూడేళ్ల కాలానికి రూ.550 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా రక్షణతో పాటు, చికిత్స కోసం లక్ష రూపాయలు అందిస్తామన్నారు.

అలాగే మరణించిన వారి మృతదేహాలను తీసుకురావడానికి విమాన ఖర్చులు, మహిళకు ప్రసూతి ఖర్చుల కింద గరిష్టంగా రూ.50,000 వరకు బీమా రక్షణతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు రూ.10 లక్షల ప్రమాద బీమా రక్షణ కోసం ఏడాదికి రూ.180 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వారికి ఆయా దేశాల దాతల సహకారంతో బీమా ప్రీమియంలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీఎన్‌ఆర్టీ వెబ్‌సైట్‌ ద్వారా పాలసీ తీసుకోవచ్చన్నారు.

చదవండి: ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి 
అమెరికా: జార్జియాలో తెలుగుకు దక్కిన ఖ్యాతి

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు