‘ఆధునిక జీవన విధానం- ఆయుర్వేదం పాత్ర’పై వీధి అరుగు సమావేశం

19 Jul, 2021 22:42 IST|Sakshi

వీధి అరుగు ఆధ్వ‌ర్యంలో ‘ఆధునిక జీవన విధానం- ఆయుర్వేదం పాత్ర’పై జూలై 25 తారీఖున ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభంకానుంది. యూరప్‌లో నివసించే వారి కోసం 15.30 CEST కార్యక్రమం ప్రారంభంకానుంది.   ఈ కార్యక్రమంలో పలు అంశాలపై ప్రముఖ వక్తలు మాట్లాడనున్నారు.  ‘భార‌తీయ వైద్య రంగం – శాంత ప్ర‌స్థానంలో నా అనుభ‌వాలు’ అంశంపై శాంతా బ‌యోటెక్ వ్య‌వ‌స్థాప‌కులు,  పద్మభూషణ్‌ కోడూరు ఈశ్వ‌ర వరప్రసాద్‌ రెడ్డి,  ‘ఆధునిక జీవ‌నం – ఆయుర్వేద పాత్ర‌’ అంశంపై కళారత్న, ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ జీ.వీ. పూర్ణచంద్‌ మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా ఐఐటీ ఢిల్లీ విశ్లేషకులు ప్రొఫెసర్‌ వి. రామ్‌ గోపాల్‌ రావు పాల్గొననున్నారు. 

 ఈ కార్యక్రమంలో విజయ్‌ భాస్కర్‌ దీర్ఘాసీ(భారత్‌), శిరీష తూనుగుంట్ల(యూఎస్‌ఏ), ప్రో. గణేష్‌ తొట్టెంపూడి(జర్మనీ), అశోక్‌ కుమార్‌ పారా(భారత్‌), విజయ్‌ కుమార్‌ (యూకే), లక్ష్మణ్‌.వి(దక్షిణాఫ్రికా), అన్నపూర్ణ మహీంద్ర(ఫ్రాన్స్‌), రవిచంద్ర నాగబైరవ(నార్వే), సత్యనారాయణ కొక్కుల(నార్వే), శ్రీని దాసరి(నార్వే), సునీల్‌ గుర్రం (నార్వే), రామకృష్ణ ఉయ్యూరు(నార్వే), శైలేష్‌ గురుభగవతుల(ఫిన్లాండ్‌),శివప్రసాద్‌రెడ్డి మద్దిరాల(డెన్మార్క్‌), అచ్యుత్‌రామ్‌ కొచ్చర్లకోట(ఫిన్లాండ్‌) ఆయా దేశాల సమన్వయకర్తలుగా ఉండనున్నారు.

ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని నిర్వహణ సంస్థ వీధి అరుగు పేర్కొంది. కార్యక్రమానికి   సంబంధించిన బ్రోచర్‌ను నిర్వహకులు విడుదల చేశారు. నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న గాయకుడు కార్తీక్ మద్దాల పాటతో ప్రారంభం కానుంది. కార్యక్రమానికి  డాక్టర్‌ విద్య వెలగపూడి అనుసంధానకర్తగా వహించనున్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు,  మీ ప్రశ్నలను ఈ క్రింద లింక్ ద్వారా తెలపవచ్చును:

https://tinyurl.com/VeedhiArugu

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాన్ని లైవ్‌ ద్వారా  వీక్షించవచ్చు:

1. Join Zoom meeting

https://us02web.zoom.us/j/87433469173?pwd=QXpNK3ZVbVFYVkFIUm0wdElhNU1odz09

Meeting ID: 874 3346 9173
Passcode: arugu

2. Youtube live streaming: ఆధునిక జీవితంలో ఆయుర్వేద పాత్ర‌ : వీధి అరుగు సమావేశం, జులై 2021 - YouTube
 

మరిన్ని వార్తలు