కాలిఫోర్నియాలో బతుకమ్మ వేడుకలు

14 Oct, 2021 10:35 IST|Sakshi

తెలంగాణ పూల పండుగైన బతుక‌మ్మ వేడుక‌లు అమెరికాలో కాలిఫోర్నియాలో ఘనంగా నిర్వహించారు. ఒక్కొసి పువ్వేసి చందమామ, ఏమేమీ పువ్వొప్పునే గౌరమ్మ అంటూ తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను కొలుస్తూ మహిళలు సంబరంగా ఈ వేడుకలు నిర్వహించారు. 

ఉమ‌న్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు అంచనాలకు మించిన మహిళలు హాజ‌ర‌య్యారు. అక్టోబరు 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కన్నుల పండువగా బతుకమ్మ ఉత్సవాలను ఆడిపాడి నిర్వహించారు. 


 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు