పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా బతుకమ్మ

18 Oct, 2021 13:08 IST|Sakshi

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో అమెరికాలోని ఓరేగావ్‌ స్టేట్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్‌ నిబంధనల కారణంగా వర్చువల్‌గా ఈ ఉత్సవాలను నిర్వహించారు.  కఠిన పరిస్థితుల మధ్య మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న ఎన్నారైలను టీడీఎఫ్‌, పోర్ట్‌ల్యాండ్‌ ఛాప్టర్‌ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీనివాస్‌ కొనియాడారు.

ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో టీడీఎఫ్‌ పోర్ట్‌ల్యాండ్‌ టీం సభ్యులు సురేశ్‌ దొంతుల, వీరేశ్‌ బుక్క, శ్రీపాద్‌ రాంభట్ల, అజయ్‌ అన్నమనేని, రాజ్‌ ఆందోల్‌, మధుకర్‌రెడ్డిద పురుమాండ్ల, కొండల్‌రెడ్డి, జయ్‌అడ్ల, నిరంజన్‌, రఘుశ్యామా తదితరులు సహకారం అందించారు.
 

మరిన్ని వార్తలు