ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ కళాకారుల శతగళార్చన!

24 Aug, 2022 21:41 IST|Sakshi

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా  100 మందికి పైగా గాయకులతో ఘంటసాల శతగళార్చన చేశారు. వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్‌ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 

విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతల తో కలసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులు తో  ఘంటసాల శత గళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శతజయంతి ఉత్సవాలపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కోడలు కృష్ణ కుమారులు సంతోషం వ్య​క్తం చేశారు.

శ్యాం అప్పాలి బృందం నుంచి (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా) నుంచి సంధ్య ఈశ్వర, కళ్యాణి వల్లూరి, లలిత చింతలపాటి, కిరణ్ కొక్కిరి, ఫణి డొక్కా బృందం,దర్భా, మృదురవళి దర్భా, జయ పీసపాటి బృందం నుంచి హర్షిణీ పచ్చంటి, సుసర్ల సాయి జయంత్, నారాయణి గాయత్రి ఇయుణ్ణి, డా. సతీష్ కుమార్ పట్నాల, రోహన్ మార్కాపురం  నుంచి రోహిత్ విస్సంశెట్టి ,ఏకాంబర నెల్లూర్ ప్రకాష్, డా.సత్య చందు హరిసోమయాజుల, కన్నెగంటి వాసంతి దేవి పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి శ్రోతల్ని అలరించారు.  

మరిన్ని వార్తలు