సింగపూర్‌లో రామ్ మాధవ్ పుస్తక సభ విజయవంతం

12 May, 2022 14:28 IST|Sakshi

డాక్టర్‌ రామ్ మాధవ్ రచించిన "ది హిందుత్వ పారడైమ్" (సమగ్ర మానవతావాదం మరియు పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం విశ్లేషణ కార్యక్రమము సింగపూర్ ఘనంగా జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్  ఆధ్వర్యంలో మే 8న జరిగిన ఈ కార్యక్రమంలో పదికి పైగా స్థానిక భారతీయ సంస్థలు అధిపతులతో పాటు సుమారుగా ౩౦౦ మందికి పైగా సింగపూర్ వాసులు పాల్గొన్నారు.


పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌడేషన్ పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ రామ్ మాధవ్ మాట్లాడుతూ... నేను వ్రాసిన హిందుత్వం పుస్తకం 21వ శతాబ్దపు వాస్తవికతకు అన్వయించవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతుంది, ఈ ఆలోచన ప్రపంచ దృక్పథం ఆధారంగా మన రాజకీయ వ్యవస్థలను అభివృద్ధి చేయగలమా లేదా అనేది తెలియచేస్తుంది అని తెలిపారు.  అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేసారు.

 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థని స్థాపించాక మొట్టమొదటి స్థానిక సామూహిక కార్యక్రమము విజయవంతం అవ్వడంపట్ల నిర్వాహుకులు కవుటూరు రత్నకుమార్ తదితరులు సంతోషం తెలియచేశారు. ఈ కార్యక్రమము విజయవంతం కావడం కోసం అహర్నిశలు కృషిచేసిన  ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్,రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేసారు. కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియం, భోజన సదుపాయాలను  గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్   ప్రత్యేకంగా అందజేశారు.
చదవండి: ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు

మరిన్ని వార్తలు