టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని హర్షించిన డాల్లస్ ఎన్నారైలు!

11 Jul, 2021 17:43 IST|Sakshi

డాల్లస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకాన్ని డాల్లస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టమని తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్లో జులై 9 శుక్రవారం జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.


నిజాం నవాబు మాదిరి పరిపాలన జరు€తున్న తెలంగాణలో ప్రజల కోసం, యువకుల కోసం, బడు€గు బలహీన వర్గాల కోసం మాట్లాడే గొంతుకగా నిలిచిన పోరాట యోధుడు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం జరగాలని ఎన్నారైలు ఆకాంక్షించారు. ఈ అభినందన సభ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ లైవ్ లో పాల్గొని ఎన్నారైలని ఉద్దేశించి ప్రసంగించారు.రేవంత్ రెడ్డి తో పాటు ములుగు€ ఎమ్మెల్యే సీతక్క కూడా జూమ్ లైవ్ లో పాల్గొని తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నారైలు కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోవింద్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, చంద్ర రెడ్డి పోలీస్, వసంత్ రామ్ రెడ్డి, ఫణి రెడ్డి బద్దం తదితరులు పర్యవేక్షించారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు