ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘ‌నంగా బతుక‌మ్మ‌, ద‌స‌రా వేడుక‌లు

4 Oct, 2022 21:16 IST|Sakshi

ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, బతుకుమ్మ పండుగలని ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది హాజరయ్యారు. చిన్నారులు, పెద్దలు తమ ఆట పాటలతో, నృత్య ప్రదర్శనలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మన తెలుగు వాళ్లతో పాటు, ఫిన్లాండ్లోని ప్రజలు కూడ పాల్గొనడం గమనార్హం.

గతంలో ఫిన్లాండ్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తక్కువ మంది వరకు హాజరయ్యేవారని, కాని ఈ సారి నాలుగు వందలకి పైన హాజరుకావడం ఆనందకర విషయమన్నారు. తెలుగు వారు ఫిన్లాండ్‌కు అధికంగా వ‌స్తున్నార‌న‌డానికి ఈ సంఖ్య నిద‌ర్శ‌న‌మ‌ని ఫిన్లాండ్ తెలుగు సంఘం సంస్థ కార్య‌వ‌ర్గం ర‌ఘునాథ్ పార్ల‌ప‌ల్లి, సుబ్ర‌మ‌ణ్య మూర్తి, జ్యోతి స్వ‌రూప్ అనుమాల‌శెట్టి, స‌త్య‌నారాయ‌ణ కంచ‌ర్ల తెలిపారు.

ఇంత మందితో కలిసి పండుగ చేసుకోవ‌డం చూస్తుంటే.. మన ఊరిలో, మన ఇంటిలో ఉన్న‌ట్లే అనిపించిందన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది పాల్గొనేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి చెప్పారు.

మరిన్ని వార్తలు