జోరుగా సాగుతున్న ఆటా డీసీ కాన్ఫరెన్స్‌ సన్నాహాక ఏర్పాట్లు

7 May, 2022 16:03 IST|Sakshi

అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్ట మొదటిసారి  అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ  నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 17వ కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్ని జులై 1  నుంచి 3 తారీకు వరకు ఘనంగా నిర్వహించనున్నారు. వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి  ముఖ్య అతిథులుగా సద్గురు జగ్గీవాసుదేవ్‌, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్, కపిల్ దేవ్, బాలకృష్ణ తదితరులు విచ్చేయచున్నారు. ఆబాలగోపాలాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించే మాస్ట్రో ఇళయరాజా ట్రూప్ చేత మ్యూజికల్ నైట్‌ ఏర్పాటు చేస్తున్నారు. 

ఎంతో మంది బిజినెస్, రాజకీయ, సామాజిక, సాహిత్య, కవులు కళాకారులు, ప్రముఖులు, మేధావులు హాజరవబోతున్న ఈ కార్యకమంలో దాదాపు 1౦,౦౦౦ మందికి పైగా భాగస్వాములు అవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కవిత, జి.ఎం.ర్. ఉపాసన కామినేని తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.


   
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల అధ్యక్షతన సుధీర్ బండారు కన్వీనర్‌గా, క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ కో-హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కాన్ఫరెన్స్ కి ఉత్తర అమెరికాలో తెలుగు వారు పెద్ద ఎత్తున హాజరయ్యి తెలుగు వారి ప్రత్యేకతను చాటవలసిందిగా  ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 2.3 మిలియన​ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్ లో మినీ షాపింగ్  మాల్ తలపించనుంది. 200  పైగా ప్రత్యేక స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా రియల్ ఎస్టేట్, జ్యుయల్లరీ, చీరలు, ఇన్సూరెన్స్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టాల్స్‌ ఏర్పాటు చేయబోతున్నారు. మిగిలి ఉన్న అతి కొద్ది వెండర్‌ బూత్‌ కొరకు త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా  నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధఙంచి మరిన్ని వివరాల్లో కోసం https://www.ataconference.org/exhibits సంప్రదించగలరు.

చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధుల బృందం

మరిన్ని వార్తలు