ప్రవాస భారతీయుల కోసం ఈయూ వర్చువల్‌ మీటింగ్‌

23 Feb, 2022 12:07 IST|Sakshi

యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలలోని భారత సంతతి ప్రవాసులతో 2022 ఫిబ్రవరి 23న వర్చువల్‌ రీజనల్‌ కాన్పరెన్స్‌ నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ వర్చువల్‌ సమావేశం ఉంటుంది. 

'ఇండియన్ డయాస్పోరా డివిడెండ్ ఇన్ ది యూరోపియన్ యూనియన్' (యూరోపియన్ యూనియన్ దేశాలలో భారత సంతతి ప్రవాసుల భాగస్వామ్యం) అనే శీర్షికన జరిగే ఈ సమావేశంలో.. జగదీశ్వర రావు మద్దుకూరి (పోలాండ్), చిత్రా స్టెర్న్ (పోర్చుగల్), డాక్టర్‌  శచి గురుమాయుమ్ (స్విట్జర్లాండ్), డాక్టర్‌ మాలిని రంగనాథన్ (ఫ్రాన్స్), ప్రొఫెసర్‌ అనిల్ దావే (ఇటలీ), డా. లోకేష్ జోషి (ఐర్లాండ్), ప్రొఫెసర్‌ గుల్షన్ సచ్ దేవా (ఇండియా) పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఈ లింక్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకుని https://primetime.bluejeans.com/a2m/live-event/vevvsksk వర్చువల్‌ సమావేశంలో భాగస్వాములు కావొచ్చు. 


 

మరిన్ని వార్తలు