స్కాలర్‌షిప్‌లు అందిస్తోన్న ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీ

15 Mar, 2022 13:11 IST|Sakshi

రాబోయే విద్యాసంవత్సరానికి సంబందించి తమ సంస్థలో చదువుకోదల్చిన అంతర్జాతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తామని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ (ఎఫ్‌ఏయూ) ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌ నాలుగేళ్లు లేదా ఎనిమిది సెమిస్టర్ల పాటు అందుతుంది. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా కోర్సు పూర్తయ్యేలోపు 24 వేల డాలర్ల స్కాలర్‌షిప్‌ అందుతుంది. ఈ ఉపకార వేతనం అందడం ద్వారా విద్యార్థులకు చదుకు కోసం అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. 

ఎఫ్‌ఏయూ స్కాలర్‌షిప్‌ పొందాలంటే.. విద్యార్థులు తప్పనిసరిగా మే 1 నాటికి దరఖాస్తు పూర్తి చేసి ఉండాలి. - జీపీఏ స్కోర్‌ యూఎస్ గ్రేడింగ్ స్కేల్ పై కనీసం 3.5 నుంచి 4.0 వరకు ఉండాలి. అప్లికేషన్ మెటీరియల్స్ అన్నీ స్వీకరించిన తరువాత, అది సమగ్రంగా ఉందని యూనివర్సిటీ భావించిన తరువాత, నాలుగు వారాల్లోగా స్కాలర్ షిప్ సెలెక్షన్స్ తెలియజేస్తామని యూనవర్సిటీ ప్రతినిధులు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు పొందే భారతీయ విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్కాలర్ షిప్స్ కూడా పొందే అవకాశం ఉంది.

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో 170కిపైగా డిగ్రీలతో ఉన్న ఎఫ్ఎయూతో స్టడీ గ్రూప్ భాగస్వామ్యం భారతీయ విద్యార్థుల విద్య, కెరీర్ ఆకాంక్షలను మరింత బలోపేతం చేస్తుందని స్టడీ గ్రూప్ రీజనల్ డైరెక్టర్ ఇండియా శ్రీ కరణ్ లలిత్ 

మరిన్ని వార్తలు