ఎన్నారై స్కాలర్‌షిప్స్‌.. నవంబరు 30తో ఆఖరు

29 Nov, 2021 14:27 IST|Sakshi

Scholarship Programme For Diaspora Children : ప్రవాస భారతీయుల పిల్లల చదువుల కోసం కేంద్రం అందిస్తున్న స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ డైసపోరా చిల్డ్రెన్‌ (ఎస్‌పీడీసీ)కి దరఖాస్తు చేసుకునే సమయం 2021 నవంబరు 30తో ముగుస్తోంది. ఎస్‌పీడీసీ పథకం కింద కేంద్రం నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్లు (ఎన్నారై), పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (పీఐవో), ఓవర్‌సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కేటగిరీలకు చెందిన వారి పిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందిస్తుంది.

ఎస్‌పీడీసీ కింద ప్రతీ ఏడు 150 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందుతాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ప్రతీ కేటగిరీకి 50 వంతున స్కాలర్‌షిప్‌లు రిజర్వ్‌ చేశారు. అర్హతలు ఉన్న విద్యార్థులు విదేశాంగ శాఖ పొర్టల్‌ లేదా spdcindia.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని.. ఆ తర్వాత సంబంధిత పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు