డాలస్‌లో తానా పుస్తక మహోద్యమం

6 Apr, 2022 13:58 IST|Sakshi

డాలస్ (టెక్సస్) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పుస్తక మహోద్యమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు వారి పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు  ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. పుస్తకాలను కొని బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించడం మంచి విషమన్నారు. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తక పఠనం పై ఆసక్తి పెరగాలంటే, వారికి మంచి పుస్తకాలను పరిచయం చెయ్యాలని సూచించారు. ‘పాతికవేల పుస్తకాలు పాఠకుల చేతుల్లోకి’ అనే నినాదంతో ప్రారంభించిన ఈ అక్షర యజ్ఞానికి విశేష స్పందన లభిస్తోందన్నారు.    

టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య నానాటికి పెరుగుతుందని రాష్ట్ర అభివృద్దికి వారి సహాయం మరువలేనిదని  టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ‘గ్రెగ్ అబ్బాట్ అన్నారు. తానా పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు సులభతరంలో తెలుగు నేర్చుకునే విధంగా పాఠ్యాంశాలను రూపొందించామని తెలిపారు. ఇప్పటికే అమెరికా అంతటా, విదేశాలలో కూడా తానా పాఠశలలో వేల సంఖలో పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు వివరించారు. 

ప్రముఖ రచయితలు డాక్టర్‌ బీరం సుందరరావు, అత్తలూరి విజయలక్ష్మి గౌరవ అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో లోకేష్ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్‌ సుధా కలవగుంట, డాక్టర్‌ ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, స్వర్ణ అట్లూరి, రాజేశ్వరి ఉదయగిరి, భాస్కర్ రాయవరం, డాక్టర్‌ భానుమతి ఇవటూరి , లక్ష్మి పాలేటి, ఉమామహేశ్వరావు పార్నపల్లి (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్,  కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల, డాక్టర్‌ అరుణ జ్యోతి, వెంకట్ తాడిబోయిన మొదలైన పలువురు పురప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు