న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు

2 Jun, 2022 19:43 IST|Sakshi

ఎనిమిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు 2022 సెప్టెంబరు 17, 18 తేదిల్లో న్యూజిలా​ండ్‌ రాజధాని అక్లాండ్‌ వేదికగా నిర్వహించబోతున్నారు. న్యూజిలాండ్‌ తెలుగు సంఘం రజతోత్సవాల సందర్భంగా వర్చువల్‌గా 24/7గా ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల్లో ఐదు ఖండాలో యాభై దేశాలకు చెందిన సాహిత్తివేత్తలు పాలుపంచుకోనున్నారు. 

ఈ వేడుకల్లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్ & హైదరాబాద్), న్యూజిలాండ్‌ తెలుగు సంఘం (అక్లాండ్‌), తెలుగు మల్లి పత్రిక (ఆస్ట్రేలియా), శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), మలేషియా తెలుగు సంఘం (కౌలా లంపూర్), వంశీ ఇంటర్ నేషనల్ (హైదరాబాద్, భారత దేశం), వీధి అరుగు (ఆస్లో, నార్వే), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్), తెలుగు తల్లి పత్రిక (టొరంటో, కెనడా)లు ఈ వేడుకల నిర్వాహనలో భాగం కానున్నాయి.

మరిన్ని వార్తలు