ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సలహాదారుడిగా డా. వాసుదేవరెడ్డి 

3 Jul, 2022 12:48 IST|Sakshi

 సాక్షి, అమరావతి: అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్. వాసుదేవరెడ్డి ఆర్. నలిపిరెడ్డిని వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ నియమించింది. ఎన్.ఆర్.ఐ మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, అలాగే చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవరెడ్డి కృషి చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీత భత్యాలు ఆశించకుండా పనిచేసేందుకు ఆయన ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు  ఆయన ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. అలాగే దివంగత వైఎస్సార్‌  ఆశయాలను సాధించటమే లక్ష్యంగా, ఎన్‌ఆర్‌ఐలను సమీకృతం చేస్తామని తెలిపారు.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడించారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు డాక్టర్లను సమస్వయం చేసి తమ సొంత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా పాటు పాడుతా నన్నారు.  అమెరికాలో అమలవుతున్న అత్యంత అధునాతన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ రంగం ఏపీకి చేరువయ్యేలా పనిచేస్తామని, అలాగే వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల సేకరణ, నిధుల సమీకరణకు కృషి చేస్తానని వాసుదేవరెడ్డి తెలిపారు. 

కాగా చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం బుచ్చిరెడ్డి కండ్రిగ వాసుదేవరెడ్డి స్వస్థలం. విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీ ఎంబిబీఎస్ పూర్తి చేసిన ఆయన  అసంతరం అమెరికా వెళ్లి మెల్ బోర్న్ (ఫ్లోరిడా  ఆయన సేవలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు