నార్త్ కరోలినాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి ఉత్సవాలు

16 Jul, 2021 08:12 IST|Sakshi

అమెరికాలో జననాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌  జయంతిని పురస‍్కరించుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినా రాష్ట్రం  షార్లెట్ నగరంలో వైఎస్సార్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సామూహిక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో  వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్ ను అందించినట్లు చెప్పారు. అదే విధంగా వైఎస్సార్‌ అభిమానులు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, వైఎస్సార్  ఫౌండేషన్ సేవల్ని వినియోగించుకోమని తెలియచేసారు.

రాధాకృష్ణ కాలువాయి వైఎస్సార్ సేవల్ని కొనియాడుతూ వైఎస్సార్ అభిమానులకు ఘన స్వాగతం పలికారు. సునీత రెడ్డి మాట్లాడుతు వైఎస్సార్ రైతుల పక్షపాతి అని, ఎప్పుడు రైతుల గురించి వారి భరోసా గురించి ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ రైతులకు స్ఫూర్తిగా వైఎస్సార్ జయంతి నాడు వనభోజనాలు ఏర్పాటుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.  

పలువురు వక్తలు వై ఎస్సార్ గారు చేసిన సేవలను కొనియాడారు. కేక్ కట్ చేసి, వై ఎస్సార్ గారి పుట్టినరోజు ని ఘనంగా జరుపుకొన్నారు. ఫుడ్ డ్రైవ్ దాతలకు, వాలంటీర్లకు పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియచేశారు. ఫుడ్ డ్రైవ్ చేయడం, ఆనందం గా వనభోజనాలు నిర్వహించినందుకు వై ఎస్సార్ అభిమానులు నిర్వాహకులను  అభినందించారు.

 వాతావరణంలో జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో సుబ్బా రెడ్డి మేకా, రాధాకృష్ణ కాలువాయి, సునీత రెడ్డి, సురేష్ దేవిరెడ్డి, సంజీవ రెడ్డి, మస్తాన్ రెడ్డి, బాజీ షేక్, ప్రసన్న కూసం, అశోక్ మోర ల సారధ్యంలో పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. 

దాతలు రాజశేఖర  రెడ్డి  సున్నం, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, అశోక్ మోర, రౌనక్ రెడ్డి, నారాయణ్  దొంతు, బాజీ షేక్, జగదీష్, సునీత రెడ్డి, రఘునాథ్ కొత్త, రాధాకృష్ణ కలువాయి సుబ్బా రెడ్డి మేకా సహకారం చేశారు. వాలంటీర్లు సురేష్ దేవిరెడ్డి, సునీత రెడ్డి, బాజీ షేక్, మస్తాన్ రెడ్డి, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, చందు  రెడ్డి , నారాయణ్  దొంతు, సంజీవ రెడ్డి, దుశ్యంత్  రెడ్డి, జగదీష్ , అశోక్ మోర, ప్రసన్న కూసం, హరినాథ్  చేజెర్ల,  వెంకట్  జమ్ముల , శ్రీధర్  రామిరెడ్డి, కిరణ్  అంకిరెడ్డి, వీర  రెడ్డి గొట్టివీటి, శంకర్  రెడ్డి  తమ్మాలు సేవలం‍దించారు.  

మరిన్ని వార్తలు