ఆకలిపై పోరులో డ్రీమ్‌ కేర్‌

11 Aug, 2021 17:18 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్‌ దొండేటి నిర్వహిస్తోన్న  డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది.   ఫండ్‌ రైజింగ్‌ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్‌ ఫౌండేషన్‌ సమీకరించింది. ఈ నిధులతో  పది వేల మీల్‌ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్‌లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది.  దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. 

ఈ కార్యక్రమంలో రైజ్‌ ఎగైనెస్ట్‌హంగర్‌ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సహకారాలు అందించింది. హై స్కూల్‌ స్థాయిలోనే ఫండ్‌ రైజింగ్‌ ద్వారా  అమెరికా, ఇండియాలతో పాటు ఆకలితో  ఉన్న వారికి సాయపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న కుషాల్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు.


 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు