సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు!

31 Aug, 2022 20:55 IST|Sakshi

సింగపూర్‌ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగారు. ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన ఈ ఉత్సవాల్లో  సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. ఈ  పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలు గా  నడికట్ల భాస్కర్,  నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్ వ్యవహరించారు. 

సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె  నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త  నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్,  రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. 


 


 

మరిన్ని వార్తలు