నిరాటంకంగా ఘంటసాల స్వర రాగ మహాయాగం

22 Jan, 2022 18:22 IST|Sakshi

అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకలు నిరాటకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ‘‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’’ కార్యక్రమం 50వ రోజు పూర్తి చేసుకుంది.
 

‘‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’’, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ వేడుకల్ని.  2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో..  ఇప్పటికే భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహరైన్, ఒమాన్, అమెరికా మొదలైన దేశాలనుండి గాయనీగాయకులు పాల్గొన్నారు. మధురగాయకుడు ఘంటసాల గీతాలను ఆలపించారు. 

ఇక 50వ రోజు సందర్భంగా శిరోమణి డా. వంశీ రామరాజు ఘంటసాల మందిరంలో దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విజయనగరం నుండి లలితా అలమేలు మంగ, జడ్చర్ల నుండి శైలజామూర్తి ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను ఎన్నుకుని ఆలపించారు.  రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా , సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.  శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షిస్తున్నారు.

చదవండి: ‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు