గురుదేవ్ రవిశంకర్‌కు 'గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌' అవార్డు

13 Nov, 2022 23:39 IST|Sakshi

అట్లాంటా: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్‌ నవంబరు 10న అట్లాంటాలో 'గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌' అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకుగానూ గాంధీ ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ ఆయనకు ఈ అవార్డును మార్టిన్ లూధర్ కింగ్ కేంద్రంలోని మహాత్మా గాంధి విగ్రహం ముందు ప్రధానం చేసింది.

డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మేనల్లుడు ఐసాక్‌ ఫెర్రిస్‌, భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ స్వాతి కులకర్ణి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కమ్యునిటి సమక్షంలో గాంధీ ఫౌండేషన్ అద్యక్షులు సుభాష్ రాజదాన్, కార్యవర్గ సభ్యులు ఆంటోనీ తలియాత్, రవి పోణంగిల నుంచి శ్రీశ్రీ రవిశంకర్ ఈ అవార్డును అందుకున్నారు.
గతంలో దలైలామా, అమెరికా అద్యక్షులు జిమ్మికార్టరు, కరొట్టా స్కాట్ కింగ్, దాదా వాస్వాని గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌ అవార్డును అందుకున్నారు. అవార్డ్ ప్రధానంతరం, రవిశంకర్ మహాత్మ గాంధీ విగ్రహం నుంచి మార్టిన్ లూధర్ కింగ్, కొరట్ట స్కాట్ కింగ్ సమాధుల వరకు శాంతి యాత్రను సాగించటాన్ని విశేషంగా చెప్పవచ్చు.
చదవండి: యూకే,యూరోప్‌లో అంగరంగ వైభవంగా తితిదే శ్రీనివాస కళ్యాణోత్సవాలు

మరిన్ని వార్తలు