ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..!

5 Dec, 2021 20:03 IST|Sakshi

ప్రపంచదేశాలను కోవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే సుమారు 38 దేశాలకు పాకింది. అందులో భారత్‌ కూడా చేరింది. దీంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా అలర్టైంది. విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలపై, ఇతర దేశస్తులపై ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లను కచ్చితం చేసింది.  

ఢిల్లీ, ముంబై ఎయిర్పోట్‌లో పడిగాపులు..!
విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ను కచ్చితం చేయడంతో ప్రయాణికులు కోవిడ్‌-19 టెస్ట్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లో నెగటివ్‌ వస్తేనే ఆయా ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లనుంచి బయటకు పంపిస్తున్నారు. అయితే ఒక్కో టెస్ట్‌ ఫలితాలు రావడానికి ఏకంగా  4-6 గంటల సమయం పడుతోంది. దీంతో ఎన్నారైలు, ఇతర దేశస్థులు గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. . 

ఫుల్ క్రౌడ్..నో కోవిడ్‌ రిస్ట్రిక్షన్స్‌..!
ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లను భారత ప్రభుత్వం కచ్చితం చేయడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాస్తోన్న ప్రయాణికుల ఫోటోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గోయెంకా ట్విటర్‌లో షేర్‌ చేశారు. కోవిడ్‌ నిబంధనలను పాటించకుండా  ఫుల్‌ క్రౌడ్‌తో నిండిపోయిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ కోవిడ్‌ హాట్‌స్పాట్‌గా మారే అవకాశం లేకపోలేదని గోయెంకా అభిప్రాయపడ్డారు.


చదవండి: అమెరికా వెళ్తున్నారా? ఈ రూల్స్‌ పాటించాల్సిందే ! బైడెన్‌ సర్కార్‌ కొత్త ఆదేశాలు

మరిన్ని వార్తలు