ఘనంగా లింగారెడ్డి భీమారెడ్డి పుట్టినరోజు వేడుకలు

9 Feb, 2021 16:45 IST|Sakshi

చికాగో : హిందూ టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో ప్రెసిడెంట్‌ లింగారెడ్డి భీమారెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు చికాగోలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి పలువురు వ్యాపార, రాజకీయ నాయకులు హాజరై భీమారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.హిందూ టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో దేవాలయానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. 

అనేక స్వచ్ఛంద సంస్థలకు వివిధ రూపాల్లో సేవలందిస్తూ ముఖ్యంగా తెలుగువారికి ఎంతో సహాయ,సహకారాలు అందించే భీమారెడ్డి..ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురంలో 1941లో జన్మించారు. రాజమండ్రి, కాకినాడలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1967లో అమెరికా వచ్చిన ఆయన రేతియాన్‌ అనే స్టీల్‌ కంపెనీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత చికాగోలోని హిందూ టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో అనే దేవాలయానికి ప్రెసిడెంట్‌గా ఐదు పర్యాయాలు పనిచేయారు. ఈ ఆలయానికి 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్తాపన చేశారు.

అనతికాలంలోనే  ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆలయ నిర్మాణంలో బ్యాంక్‌ రుణాలను పూర్తిగా చెల్లించడంలో భీమారెడ్డి ముఖ్యమైన పాత్ర పోషించి, ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. ఈ వేడుకకి ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు రాజా కృష్ణమూర్తి, సాయి మందిర్‌ మాజీ అధ్యక్షులు డా. కట్టమంచి ఉమాపతి రెడ్డి, వెస్ట్‌మాంట్‌ ఇండియన్‌ కమ్యూనిటి ప్రతినిధులు వెంకటరెడ్డి సహా పలువురు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. 

మరిన్ని వార్తలు