వర్జీనియాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

18 Aug, 2021 15:03 IST|Sakshi

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్ట్‌ 15న అమెరికా  వర్జీనియాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ప్రతి నిధులు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా అధ్యక్షురాలు సుధారాణి కొండపు మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టి పెరిగిన మన భావితరాలు ఆనందించేలా  మన భారతీయతను ప్రతిబింబించే  జెండా రంగులలోని కాషాయరంగు ,తెలుపు, ఆకుపచ్చ వర్ణాల అలంకరణతో పార్క్ ఏరియా కళకళలాడుతుందని అన్నారు. పిల్లలకు చాక్లెట్లను, బహుమతులను పంచుతూ తమ కార్యవర్గసభ్యులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, ట్రస్టీలు, గోపాల్ నున్న , వెంకట్ కొండపోలు కార్యవర్గసభ్యులు సతీష్ వడ్డి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి , పార్ధ బైరెడ్డి ,హరీష్ కొండమడుగు , రామచంద్ర ఏరుబండి , రాజు గొడుగు, సతీష్ సుంకనపల్లి,రమణారెడ్డి, ఉదయ్ , సాయి, రంగా, కౌశిక్ , విష్ణు, వినీత్ , కృష్ణకిశోర్, సంధ్య, రాధిక, అవని, లావణ్య, సుప్రజ ,విజయ,హరిత తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు