ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఔదార్యం..

20 May, 2021 14:22 IST|Sakshi

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ గత 53 ఏళ్లుగా ప్రవాస భారతీయుల సంక్షేమానికి ​కోసం పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ అండగా నిలుస్తోంది. అయితే భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగసామ్యం కావడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు కరోనా బాధితులకు అవసరమయ్యే సుమారు రూ.10 లక్షల విలువైన ఆక్సిజన్‌ సిలిండర్స్‌ని ఢిల్లీలోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారికి పంపించింది.

భారత దౌత్య కార్యాలయ విజ్ఞప్తి మేరకు ఎమిరేట్స్‌ విమానయాన సంస్థ ఈ ఆక్సిజన్‌ సిలిండర్స్‌ని ఉచితంగా ఇండియాకు రవాణా చేసింది. ఎమిరేట్స్‌ విమానయాన సంస్థకి యూఏఈలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆ సంస్థ సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాసరావు అన్నారు. రానున్న రోజుల్లో మరింత సహాయం అందిస్తామని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు జార్జ్‌ వర్గీస్‌, క్రీడా కార్యదర్శి ఫ్రెడ్డీ జె. ఫెర్నాండెజ్‌, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ సి. జార్జ్‌ వర్గీస్‌, జనరల్‌ మేనేజర్‌ రాజు పాల్గొన్నారు.

(చదవండి: TikTok: నేను మరీ అంత సోషల్‌ కాదు.. సీఈఓగా ఉండలేను)

మరిన్ని వార్తలు