‘ఇండియా అమెరికాల మధ్య సత్సంబంధాలున్నాయి’

3 Nov, 2021 11:29 IST|Sakshi

డాలస్, టెక్సాస్: జాతీయ సమైక్యతా దినంగా సర్థార్‌ వల్లభభాయి పటేల్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని భారత రాయబారి తరంజిత్ సింగ్ సందు అన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ), ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్‌టీ) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు 50 వరకు వివిధ భారతీయ సంఘాల నుండి 200లకు పైగా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికాలో భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సందు ముఖ్య అతిధిగా, భారత కాన్సులేట్ అధికారి అసీం మహాజన్ ప్రత్యేక అతిధిగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తరంజిత్‌సింగ్‌ మాట్లాడుతూ.. అమెరికా భారత దేశాల మధ్య సత్సంబంధాలు, వాణిజ్య అభివృద్ధికి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ ఇతోధికంగా కృషి చేస్తున్నారని ఇదే సమయంలో భారతదేశం కూడా ఎంతో ఆసక్తి తో అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన జారీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర,  ఐఏఎన్‌టీ అధ్యక్షుడు శైలేష్ షా ఇతర బోర్డు సభ్యులు అథిధులను ఘనంగా సన్మానించారు. సమావేశం అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు