సింగపూర్ 'రీజినల్ కోఆర్డినేటర్'గా ఇచ్చాపురం వాసి

1 Feb, 2021 20:36 IST|Sakshi

అమరావతి : ఇచ్చాపురం సీనియర్ నాయకులు దక్కత లోకనాధం రెడ్డి పెద్ద కుమారుడు దక్కత జయప్రకాష్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ ఎన్నార్టీ సంస్థ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆయనకు నియామక పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా జయప్రకాశ్‌రెడ్డి స్పందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రజలకు చేసిన విశేష సేవ కార్యక్రమాలు, పని పట్ల అకింత భావాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తనకు ఈ భాద్యతలు అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, ఏపీఎన్ఆర్‌టీఎస్‌ ఛైర్మన్ మేడపాటి వెంకట్‌కు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. తన భాధ్యతను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్‌ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ.. పెట్టుబడులు, ఇతర అవకాశాలకు సింగపూర్‌లోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని జయప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు