కడప వరదలు.. నిత్యావసరాలు అందించిన నాటా-వైఎస్సార్‌ అభిమానులు

4 Dec, 2021 13:02 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కడప జిల్లాలోనూ ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. కొంతమంది జీవనోపాధి కోల్పోగా.. మరికొందరు ఆస్తినష్టం జరిగి కట్టుబట్టలతో మిగిలారు. ఈ పరిస్థితుల్లో తక్షణ సహాయంగా మౌలికమైన వసతులు కల్పించటం కోసం ఎన్నారైలు కదిలారు. 
 

అమెరికాలోని అట్లాంటా సిటీ నాటా అసోషియేషన్‌, వైఎస్సార్‌ అభిమానులు స్పందించి విరాళాలు అందించారు.  దాతల్లో ఒకరైన నాటా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి కొట్లూరు ఇక్కడే ఉండటం వల్ల స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  పలు గ్రామాలకు వెళ్లి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 

రాజంపేట మండలం మండపల్లిలో చెయ్యేరు ఉధృతికి రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో తలా ఒక  లక్ష రూపాయల సహాయం అందచేశారు.  అలాగే ప్రొద్దుటూరు సమీపంలోని పెన్నా నది తీరాన ఉన్న మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలోని 35 మందికి దుప్పట్లు దోమతెరలు, దుస్తులు పంచిపెట్టారు. అలాగే మరో రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు.

ఈ సాయం అందించిన వెంకట రామ్ రెడ్డి చింతం,  నంద గోపినాధ రెడ్డి, పంగ భూపాల్, ఉపేంద్ర రెడ్డి, కందుల కిరణ్, యర్రపురెడ్డి అనిల్ రెడ్డి, ఓజిలి పాండురంగారెడ్డి, గూడా కృష్ణమోహన్ రెడ్డి, హారతి శ్రీహరి, ఎద్దుల మోహన్ కుమార్, సగిలి రఘు రెడ్డి, నరాల సతీష్, చారుగండ్ల లక్ష్మీనారాయణ, తమ్మినేని శివ, బొమ్మిరెడ్డి రామిరెడ్డి, హరి హర రెడ్డి, ఆలూరి శ్రీనివాస్, బోరెడ్డి రవి కుమార్‌లకు.. సాయం అందుకున్న పలువురు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు