వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

1 Nov, 2022 11:05 IST|Sakshi

సింగపూర్ సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సమీపంలోని కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తికవనభోజనాలను నిర్వహించారు. స్వయంగా తయారుచేసుకున్న వంటకాలతో సామూహికంగా సముద్ర నౌక విహారంలొ కుసు ద్వీపాన్ని చేరుకొన్నారు. ఈసందర్భంగా సముద్ర ఇసుకతో విజయలక్ష్మి, ముక్క ఇంద్రయ్య అంజలి, చైతన్య  కలిసి  రూపొందించిన  సైకత లింగం విశేష ఆకర్షణగా నిలిచింది.

సామూహిక లింగాష్టకం, శ్రీమారియమ్మన్ ఆలయంనుండి తెచ్చిన అమ్మవారి విగ్రహానికి  ప్రార్థనలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో  సంయుక్తంగా  సామూహిక కార్తీక దీప సమర్పణ చేసారు.  ఆరంభంలో  క్లబ్ సెక్రటరీ నరేంద్రకుమార్ నారంశెట్టి  కార్తీకమాస వైభవాన్ని, కార్తీకమాస ప్రాముఖ్యతను,  మహాశివుని విశిష్టతను సభ్యులకు వివరించారు, ఈ కార్యక్రమంలో చిరంజీవి మౌల్య కిషోర్,అమృత వాణి మానస  నాట్య ప్రదర్శన ఆకట్టుకొంది. వినయ్, శిల్ప మకేష్, దివ్య మంజుల, స్వప్న మంచికంటి, నీమ ఆనంద్, శ్రావణి, హైందవి లు 80 కి పైగా కుటుంబాలతో 250 మంది సభ్యుల సమన్వయంతో షడ్రషోపేతమైన విందుభోజనాలు  సమ కూర్చడం విశేషం.  ఫ్లాష్ మాబ్,  విగ్నేశ్వర్ రావ్  మానస సహకారంతో  ఫ్యాషన్ వాక్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది.   అనంతరం విజేతలకు  ప్రత్యేక బహుమతులు  అందించారు.

గత పది సంవత్సరాల్లో కమిటీ ఎంతో వైభవాన్ని సంతరించుకొందని క్లబ్ సహ వ్యవస్థాపకుడు  మంచికంటి శ్రీధర్ ప్రశంసించారు.  ఇంకా  సీనియర్ సభ్యులు విజయ్ వల్లంకొండ, భాస్కర్ గుప్త, ప్రసాద్, దివ్య, గోపి కిషోర్, సతీష్ కోట తమ అనుభవాలను పంచుకున్నారు. సేవాదళ్ సభ్యులు శివ కిషన్, ఫణీష్, వినయ్ చంద్, శ్రీనివాస్ అమర, సతీష్ వుద్దగిరి, హైందవి, కొత్త హరింద్రబాబు, అనిల్ గాజులపల్లి, మణికంఠ,  కిషోర్, నందన్, మానస్  తదితరులు కార్యక్రమం విజయవంతానికి తోడ్పడ్డారు. 

ముగింపు సభలో కిషోర్ శెట్టి పోషించిన కీలక పాత్రను క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి ,సీనియర్ కమిటీ సభ్యుడు ముక్కాకిషోర్ అభినందించారు గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్రసేవలను గుర్తిస్తూ సీనియర్ సభ్యులందరు దంపతులకు ప్రత్యేకంగా సన్మానించారు. సింగపూర్‌లో  కోవిడ్ పరిస్థితుల తరువాత మళ్లీ మూడేళ్లకు 250 మంది సభ్యులతో  కుసు ద్వీపంలో ఈ  కార్యక్రమం నిర్వహించడంపై  నరేంద్ర సంతోషం వెలిబుచ్చారు.  వైశ్యులు అన్ని ధార్మిక, సేవా కార్యక్రమాల్లో ఎప్పటిలాగే ముందుండి ఇక మీదట కూడా నడిపించాలని అభిలషించారు.

మరిన్ని వార్తలు