ఆస్ట్రేలియాలో కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ పోస్టర్‌ ఆవిష్కరించిన కవిత

9 Jun, 2023 16:27 IST|Sakshi

ఆస్ట్రేలియాలో కేసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన కవిత

బీఆర్‌ఎస్‌ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో కేసీఆర్‌ కప్‌ టోర్నమెంట్‌  నిర‍్వహించనున్న నేపథ్యంలో ఎంఎల్‌సీ కవిత పోస్టర్‌ను  ఆవిష్కరించారు. 29 రాష్ట్రాల NRIలు పాల్గొంటున్న టోర్నమెంట్.. టీఆర్‌ఎస్‌నుంచి  బీఆర్‌ఎస్‌గా  రూపాంతరం చెందిన తరువాత ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం , కేసిఆర్ తెలంగాణాలో చేసిన అభివృద్ది , కేసిఆర్ భావజాల వ్యాప్తి చేయడానికి క్రికెట్ టోర్నమెంట్‌ను ఎన్నుకునామని , ఈ టోర్నమెంట్ లో భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాల కు చెందిన వారు పాల్గొంటారని, తద్వారా కేసిఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండాను NRI లందరికీ చేరుతుందని అందుకే బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం క్రికెట్ కప్ టోర్నమెంట్‌ను ఎంచుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులందరికీ తెలియచేసేలా , అలాగే ఉద్యమం నుండి పార్టీకి విశిష్ట కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని కవిత అభినందించారు . కేసిఆర్ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతీ గ్రామానికి స్టేడియం నిర్మించబోతున్నారని, దీని స్ఫూర్తి తోనే మేము క్రికెట్‌ను పార్టీ భావజాల వ్యాప్తికై ఎంచుకున్నామని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బాబా ఫసియుద్దిన్ ,సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారీతో పాటు ఇతర  నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు