అదృష్టాన్ని ఊహించగలమా? సరదాగా కొన్న టికెట్‌.. 44 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది

6 Feb, 2022 07:58 IST|Sakshi

Kerala woman living in Abu Dhabi wins Big Ticket lottery Worth 44 Crores: నిజంగా అదృష్టాన్ని ఊహించగలమా? అలాంటి నమ్మకమే లేని ​ఓ యువతి.. సరదాగా తన కొలీగ్స్‌తో కలిసి టికెట్‌ కొన్న ఆ భారతీయ యువతికి జాక్‌పాట్‌ తగిలింది. అదీ కలలో కూడా ఆమె ఊహించని రేంజ్‌లో.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ తగిలింది ఆమె టికెట్‌ మీద!. 


సౌదీ కంట్రీస్‌లో భారీ ప్రైజ్‌ మనీ లాటరీలు సర్వసాధారణం. అలాంటి జాక్‌పాట్‌ ఓ కేరళ యువతిని వరించింది. ఫిబ్రవరి 3న బిగ్‌ టికెట్‌ అబుదాబీ వీక్లీ డ్రా నిర్వహించారు. అందులో ఏకంగా 22 మిలియన్ల దీరామ్స్‌(మన కరెన్సీలో 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయల దాకా) ఆమె టికెట్‌ గెల్చినట్లు ప్రకటించారు.    

ఆమె పేరు లీనా జలాల్. లీనా స్వస్థలం కేరళ త్రిచూర్. అంజన్ గడి ప్రాంతానికి చెందిన ఆమె, ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటోంది. అబుదాబిలో షోయిదార్ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎల్ఎల్ సీ అనే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఈ మధ్య తన పది మంది ఆఫీస్‌ సహచరులతో కలిసి Terrific 22 million series 236లో భాగంగా ఆమె టికెట్‌ కొన్నది.

తాజాగా డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు రూ.44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి రూ.4 కోట్లు దాకా వస్తుంది. దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ.. లాటరీ తగిలిందని చెప్పగానే, తొలుత నమ్మలేకపోయానని వెల్లడించింది. తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానని తెలిపింది. అయితే, ఈ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబ సభ్యులను అడిగిన తర్వాత నిర్ణయించుకుంటానని లీనా తెలిపింది. 

మరో నలుగురూ భారతీయులే.. 
బిగ్‌ టికెట్‌ అబుదాబీ వీక్లీ డ్రాలో లీనా కాకుండా గెలిచిన మరో నలుగురు కూడా భారతీయులే కావడం విశేషం. సెకండ్‌ ప్రైజ్‌ను సురాయిఫ్‌ సురు(2 కోట్ల రూ. పైగా), సిల్‌జోహ్న్‌ హోయాన్నన్‌ (కోటికి పైగా), నాలుగో ప్రైజ్‌ అన్జర్‌ సుక్కారియా(యాభై లక్షల రూ.), ఐదో ప్రైజ్‌ దివ్య (20 లక్షలరూ.) దక్కాయి. బంగ్లాదేశ్‌కు చెందిన నజీర్‌ అనే వ్యక్తికి రేంజ్‌ రోవర్‌ ఎవోక్యూ దక్కింది. మార్చి 3న ఈ ప్రైజ్‌మనీని, గిఫ్ట్‌ను అందించనున్నారు.

మరిన్ని వార్తలు