కోదాడ మహిళకు సూపర్‌ ఉమెన్‌ ఇన్‌ సర్వీస్‌ అవార్డు

14 Aug, 2021 21:31 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా సమయంలో చేసిన సేవకు గాను కోదాడ మండలానికి చెందిన  చింతా నవ్య స్మృతికి  అమెరికాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ " ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారి ఆధ్వర్యం లో  "సూపర్ వుమన్ ఇన్ సర్వీస్ అవార్డు" పురస్కారాన్ని, 500 డాలర్ల రివార్డ్‌ను అందచేశారు. చింతా నవ్య స్మృతి అమెరికాలో ని "మేరీల్యాండ్ "లో ప్రాంతంలో నివసిస్తూ.. కరోనా సమయంలో తన వంతు బాధ్యతగా మెడికల్ హెల్ప్, డాక్టర్స్ సంప్రదింపులు, బ్లడ్ ప్లాస్మా డొనేషన్స్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ , పీపీఈ కిట్ల డిస్ట్రిబ్యూషన్ పలు గ్రామాలకు అందచేయడం లో కోఆర్డినేట్ చేశారు.

అంతేకాకుండా  కాన్సర్ హాస్పిటల్స్ లో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు.తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలకి తన వంతు సహాయంగా దాతలతో కలిసి  కాలేజీలకు ఫీజులను చెల్లించారు. ఫీస్లు కాలేజీ కి కట్టడానికి దాతలతో కలిసి  సహాయం చేయగలిగారు. చింతా నవ్య స్మృతి సామాజిక కార్యక్రమంలో తన సేవలు అందిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు