టాంటెక్స్ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ

11 Jan, 2021 10:20 IST|Sakshi

డల్లాస్‌: ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం నూతన అధ్యక్షురాలిగా పాలేటి లక్ష్మి అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 3న  డల్లాస్‌లో జరిగిన గవర్నింగ్‌ బోర్డు సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. లక్ష్మి అన్నపూర్ణ మాట్లాడుతూ, టాంటెక్స్‌ లాంటి గొప్ప సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ ప్రమాణాలు పెంచేవిధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

2021 అధికారిక కార్యనిర్వాహక బృందం:
అధ్యక్షురాలు: లక్ష్మి అన్నపూర్ణ పాలేటి
ఉత్తరాధ్యక్షుడు: ఉమా మహేష్‌ పార్నపల్లి 
ఉపాధ్యక్షుడు: ఎర్రం శరత్‌రెడ్డి
కార్యదర్శి: తామేటి కల్యాణి
సంయుక్త కార్యదర్శి: జొన్నల శ్రీకాంత్‌రెడ్డి
కోశాధికారి: పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి
సంయుక్త కోశాధికారి: ఎర్రమనేని స్రవంతి
తక్షణ పుర్వాధ్యక్షులు: కోడూరు కృష్ణారెడ్డి

కార్యవర్గ బృందం:
లోకేష్‌ నాయుడు కోణిదల, మల్లిక్‌రెడ్డి కొండా, వెంకటేష్‌ బొమ్మ, చంద్రారెడ్డి పోలీస్‌, ప్రభాకర్‌రెడ్డి మెట్టా, రఘునాథరెడ్డి కుమ్మెత్త, సరితారెడ్డి ఈదర, నీరజ కుప్పాచి, ఉదయ్‌ కిరణ్‌ నిడగంటి, భానుప్రకాశ్‌ వెనిగళ్ల, నాగరాజు చల్లా, సురేష్‌ పాతినేని, సుబ్బారెడ్డి కొండు.

పాలకమండలి బృందం:
అధిపతి: డాక్టర్‌ పవన్‌ పామదుర్తి
ఉపాధిపతి: వెంకట్‌ ములుకుట్ల
శ్రీకాంత్‌ పోలవరపు, శ్రీలక్షి మండిగ, గీతా దమ్మన్న, అనంత మల్లవరపు, డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి శనికొమ్ము.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు