ఘనంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో మీట్ & గ్రీట్

24 Aug, 2022 19:34 IST|Sakshi

అమెరికాలో 'తానా' 23వ మహా సభలు ఘనంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది జులై 7, 8, 9 తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న మహా సభల్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సభలకు అంజయ్య చౌదరి లావు అధ్యక్షులుగా, రవి పొట్లూరి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.  ఇందులో భాగంగా ఆగస్ట్‌ 20న కన్వెన్షన్ కన్వీనర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్ అట్లాంటిక్ జట్టు ఫిలడెల్ఫియా స్థానిక నాయకులు, వలంటీర్లతో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. 

300 మంది
ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమానికి 300 మంది హాజరై తమ మద్దతు ప్రకటించారు. అందుకు ఫిలడెల్ఫియా తానా టీం రవి పొట్లూరి, సునీల్ కోగంటి, సతీష్ తుమ్మల, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, సురేష్ యలమంచి, కోటి యాగంటి, మోహన్ మల్లా, గోపి వాగ్వల, జాన్ మార్క్, రాజేశ్వరి కొడాలి, రామ ముద్దన, సాంబయ్య కోటపాటి కారణమని ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. 

ఘనంగా సన్మానం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తానా సేవా కార్యక్రమాల్ని వివరించారు. అలాగే సుమారు 22 సంవత్సరాల తర్వాత తానా మహాసభల్ని మళ్ళీ హోస్ట్ చేసే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.  ఫిలడెల్ఫియా నగరాన్ని తానా మహాసభల చరిత్రలో అత్యున్నత స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నామని అన్నారు. అనంతరం ఫిలడెల్ఫియాలో 2001లో జరిగిన తానా 13వ మహాసభలలో పాల్గొన్న హరనాథ్ దొడ్డపనేని, సరోజ సాగరం, మదన్ ఇనగంటి, సుధాకర్ పావులూరి,శ్యాంబాబు వెలువోలు తదితరులను తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఘనంగా సన్మానించింది.

అంజయ్య చౌదరి లావు తోపాటు తానా నుంచి జానీ నిమ్మలపూడి, రాజా కసుకుర్తి, శ్రీనివాస్ ఓరుగంటి, దిలీప్ ముసునూరు, నాగరాజు నలజుల, కిరణ్ కొత్తపల్లి, శ్రీ అట్లూరి, సతీష్ చుండ్రు, మోహన్ మల్లా, లక్ష్మణ్ పర్వతనేని, శ్రీలక్ష్మి కులకర్ణి, వెంకట్ సింగు, శ్రీనివాస్ కోట, సుబ్బా ముప్ప, సాంబ నిమ్మగడ్డ, రామ ముద్దన, రావు యలమంచిలి, లక్ష్మి అద్దంకి, హరి మోటుపల్లి, పాపారావు ఉండవల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాల్గొన్న జాతీయ,ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు
తానా సభలకు మద్దతు పలికిన  Ata, Tta, Nata, Nats, Tagdv, Pta, Tfas, Tasj, Hta, Njta వంటి వివిధ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు ముజీబుర్ రెహ్మాన్, సురేష్ రెడ్డి వెంకన్నగారి, శ్రీనివాస్ కాశీమహంతు, మాధవరెడ్డి మోసర్ల, శర్మ సరిపల్లి, శ్రీనివాస్ భరతవరపు, సుధాకర్ తురగ, లక్ష్మి నరసింహారెడ్డి కొండా, ప్రసాద్ కునారపు, కిరణ్ గూడూరులను ఘనంగా సత్కరించారు.

మరిన్ని వార్తలు