వెటా ఆధ్వర్యంలో మదర్స్‌ డే వేడుకలు

17 May, 2022 08:57 IST|Sakshi

విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా ముగిశాయి. మే 16 న మేరీల్యాండ్‌ హానోవర్‌లో నిర్వహించిన  వేడుకలకి దాదాపు ఆరువందల మందికి పైగా సభ్యులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లోకల్‌ బ్యాండ్‌ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల‌లో విజేత‌లుగా నిలిచిన మహిళలకు చాలా బ‌హుమ‌తులను   అంద‌జేశారు. అలాగే ఆహుతులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు. ఈ మదర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించడంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరిలతో పాటు వెటా మేరీల్యాండ్ చాప్టర్ కార్యవర్గం నిర్విరామంగా కృష్టి చేసింది. 

ఈ కార్యక్రమంలో వెటా మీడియా నేషనల్ ఛైర్‌ పర్సన్‌ సుగుణారెడ్డి,  స్థానిక వెటా సభ్యులు ప్రీతీ రెడ్డి, యామిని రెడ్డి , నవ్యస్మృతి , జయలతో పాటు స్థానిక కమ్యూనిటీ లీడర్స్ సుధా కొండెపి, కవిత చల్ల, శ్రీధర్ నాగిరెడ్డి , డాక్టర్‌ పల్లవి , రామ్మోహన్ కొండా, యోయో టీవీ నరసింహ రెడ్డి  అనిత ముత్తోజు  , అపర్ణ కడారి  మొదలగు వారు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజ‌యం చేసిన వెటా స్థానిక కార్యవర్గాన్ని  ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అభినందించారు.

తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసం మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన  ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) సంస్థను రెండేళ్ల కిందట ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు. మహిళకు  అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకత (క్రియేటివిటీ)ను పెంచి వారి కలలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలని ఉద్దేశ్యంతో  ఝాన్సీరెడ్డి ఈ సంఘం స్థాపించారు. మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తోంది.

చదవండి: న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్

మరిన్ని వార్తలు