కువైట్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

12 Sep, 2021 12:29 IST|Sakshi

యువనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా మిథున్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో  కువైట్, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మిథున్ రెడ్డి సేవా సమితి, కువైట్‌ అధ్యక్షులు గోవిందు నాగరాజు, కో కన్వీనర్‌ షేక్ రహంతుల్లా ఇతర సభ్యులు యస్‌ లక్ష్మిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్‌సీపీ కువైట్  కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ జాబ్రీయాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వివిధ కమిటీల ఇన్‌ఛార్జీలు,  నాయకులు , కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.   

- వైఎస్సార్‌ కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, షేక్ ఇంతియాజ్,  చక్రంపేట మైనారిటీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

- పుల్లంపేట పార్టీ ఆఫీసు నందు కేక్ కటింగ్ చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ యూత్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
- తిరుపతిలోని మనో వికాస్ ఆశ్రమంలో అన్నదానం చేశారు.
చదవండి : టీప్యాడ్‌ ఆధ్వర్యంలో డల్లాస్‌లో రక్తదాన శిబిరం

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు